calender_icon.png 26 October, 2025 | 10:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సనత్‌నగర్‌లో పిక్సెల్ ఐ హాస్పిటల్ ప్రారంభం

26-10-2025 12:13:02 AM

ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్

సనత్‌నగర్, అక్టోబర్ 25 (విజయక్రాంతి) : సనత్‌నగర్‌లో పిక్సెల్ ఐ హాస్పిటల్ డైరెక్టర్స్ డాక్టర్ కృష్ణ పూజిత, డాక్టర్ అబ్దుల్ రషీద్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా విచ్చేసి పిక్సెల్ ఐ హాస్పిటల్ రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు.

పిక్సెల్ ఐ హాస్పిటల్ డైరెక్టర్స్ ఎమ్మెల్యే తలసానికి శాలువాలతో ఘనంగా సన్మానించారు ప్రత్యే క ధన్యవాదాలు తెలిపారు సనత్ నగర్ లో మెయిన్ రోడ్ లో ఐ హాస్పిటల్ ప్రజలకు దగ్గరగా ఉండటం చాలా సంతోషిం చదగ్గ విషయమని ప్రతి మనిషికి కంటి చూపు స్పష్టంగా ఉండేలా చూసుకోవాలని కంటి చూపు సరిగ్గా లేనిపక్షంలో వెంటనే కంటి ఆస్పత్రికి వెళ్లి వెంటనే పరీక్షలు చేయించుకుని కంటి శుభ్రతను పాటించాలని తగిన మందులు తీసుకోవాలని సూచించారు.

పిక్సెల్ ఐ హాస్పిటల్ డైరెక్టర్స్ ను ప్రత్యేకంగా అభినందించారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కొలను లక్ష్మి బాల్‌రెడ్డి, బిఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మీర్జా ఖలీల్ బేగ్, కొలను భూపాల్ రెడ్డి, సురేష్ గౌడ్, ప్రవీణ్ రెడ్డి, షఫీ, రాజేష్ ముదిరాజ్ ,జమీర్ బేగ్, నమాన్ ఉద్దీన్ తదితరులు పాల్గొన్నారు.