calender_icon.png 28 October, 2025 | 2:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొంటాం

26-10-2025 12:14:43 AM

బీజేపీ ఏపీ రాష్ర్ట అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ రాంచందర్‌రావుతో ఆయన భేటీ

హైదరాబాద్, అక్టోబర్ 25 (విజయక్రాంతి): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచా రంలో పాల్గొంటానని, రెండు రాష్ట్రాల నేత లు కలిసి కట్టుగా పనిచేసి జూబ్లీహిల్స్‌లో గెలుపునకు కృషి చేస్తామని బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. శనివారం తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాంచందర్‌రావును పార్టీ కార్యాలయంలో మాధవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రెండు రాష్ట్రాల అభివృద్ధి కార్యక్రమాలు, రాజకీయ పరిస్థితులపై చర్చించా రు.

ఈ సందర్భంగా మాధవ్ మీడియాతో మాట్లాడుతూ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటి సారి తెలంగాణ బీజేపీ కార్యాలయానికి వచ్చానన్నారు. రెం డు ప్రాంతాల ప్రజలు తమకు రెండు కళ్లు లాంటివారన్నారు. తెలంగాణతో తనకు విడదీయరాని అనుబంధం ఉందని, ఆంధ్రప్ర దేశ్‌లో డబుల్ ఇంజన్ సర్కార్ బుల్లెట్ ట్రైన్ లా ముందుకు సాగుతోందన్నారు. ఏడాదిలో లక్ష కోట్ల అభివృద్ధి పనులు జరగడం శుభశూచికమన్నారు.

మోదీ చొరవతో గూగుల్ లాంటి సంస్థలు రాష్ట్రానికి రావడం జరుగుతోందని చెప్పారు. ఇది డబుల్ ఇంజన్ సర్కార్ గొప్పతనమని, తెలంగాణ లో సైతం డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని ఆయన ఆకాంక్షించారు. కూటమిలో పురంధేశ్వరికి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నారో.. తనకూ అంతే ప్రాముఖ్యత ఇస్తున్నారని పేర్కొన్నారు. 

మర్యాదపూర్వక భేటీ: రాంచందర్ రావు

బీజేపీ ఏపీ చీఫ్ మాధవ్‌తో మర్యాదపూర్వకంగా సమావేశమైనట్లు రాంచందర్ రా వు తెలిపారు. రెండు రాష్ట్రాల అభివృద్ధి కార్యక్రమాలు, రాజకీయ పరిస్థితులపై చర్చించి నట్లు ఆయన పేర్కొన్నారు. కాగా లోక్ సత్తా వ్యవస్థాపకులు డా.జయప్రకాష్ నారాయణను హైదరాబాద్‌లోని ఆయన కార్యాల యంలో రాంచందర్ రావు మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలోని తాజా పరిస్థితులు, ప్రజా ప్రయోజన అంశాలపై చర్చించినట్లు ఆయన తెలిపారు.