01-07-2025 01:54:43 AM
ఒహాయోలో టేకాఫ్ అయిన ఐదు నిమిషాలకే ఘటన
యంగ్స్‌టౌన్, జూన్ 30: అమెరికాలోని ఒహాయోలో విషాదం చోటుచేసుకుంది. ఒక చిన్న విమానం కుప్పకూలిన ఘటనలో ఆరుగురు దుర్మరణం చెందారు. ఒహాయో విమానాశ్రయం నుంచి టేకాయి అయిన కొద్ది నిమిషాల్లోనే ఈ విమానం కుప్పకూలినట్టు అధికారులు వెల్లడించారు. ఆదివారం ఉదయం యంగ్స్‌టౌన్ ప్రాంతీయ విమానాశ్రయం సమీపంలో ఆరుగురు వ్యక్తులతో ప్రయాణిస్తున్న సెస్నా 441 కూలిపోయిందని ఫెడరల్ ఏవియేషన్ అధి కారులు తెలిపారు. ఈ దుర్ఘటనలో ఎవరూ ప్రాణాలతో బయటపడలేదని వెస్టర్న్ రిజర్వ్ పోర్ట్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆంథోని ట్రెవెనా తెలిపారు.