calender_icon.png 1 July, 2025 | 9:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీశైలం లడ్డూలో బొద్దింక... అంతా ఫేక్

01-07-2025 01:05:43 AM

తేల్చేసిన అధికారులు

శ్రీశైలం, జూన్ 30: ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీశైలంలో గల దేవస్థానం లడ్డూ ప్రసాదంలో బొద్దింక వచ్చినట్టు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారాన్ని దేవస్థాన అధికారులు ఖండించారు. ఇవన్నీ తప్పుడు ఆరోపణలని కొట్టిపారేశారు. జూన్ 29 రోజు ఓ భక్తుడు ప్రసాదం అమ్మే దేవస్థాన సిబ్బందితో గొడవకు దిగాడు. తాను కొనుగోలు చేసిన లడ్డు ప్రసాదంలో బొద్దింక వచ్చిందని ఆ భక్తుడు ఆరోపించాడు. అయితే ఈ ఆరోపణలను దేవస్థాన అధికారులు కొట్టేశారు.