09-08-2025 01:44:41 AM
మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేష్
మనోహరాబాద్, ఆగస్టు 8 : మానవాళికి ప్రాణ వాయువు అందించే మొక్కలను పెంచే బాధ్యత మనమందరం తీసు కుందామని అదనపు కలెక్టర్ నగేష్ అన్నారు. శుక్రవారం ఇండస్ట్రియల్ ఎస్టేట్, మనోహరాబాద్ మండలంలో లోకేష్ మిషన్స్ కళ్ళకల్ లో అదనపు కలెక్టర్ నగేష్ వనమహోత్సవం కార్యక్రమంలో మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ జిల్లా పరిశ్రమల శాఖ వన మహోత్సవ లక్ష్యాల మేరకు మొదటి విడతలో 2000 మొక్కలు నాటుతున్నారని, రెండో విడతలో ఇంకొక 3000 మొక్కలు, మొత్తం 5000 మొక్కలు నాటుతున్నారని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో జనరల్ మేనేజర్ డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ సెంటర్ మెదక్ జనరల్ మేనేజర్ ప్రకాష్ రావు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ తాసిల్దార్ లోకేష్, మిషన్స్ డైరెక్టర్ శ్రీనివాసరావు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.