calender_icon.png 9 August, 2025 | 5:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం సహాయనిధి చెక్కు అందజేత

09-08-2025 01:45:52 AM

మనోహరాబాద్, ఆగస్టు 8 : మనోహరాబాద్ మండలం కాళ్లకల్ గ్రామానికి చెందిన పటేల్ నిర్మల అనే మహిళ కిడ్నీలకు సంబంధించిన చికిత్స కోసం ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకోవడం జరిగింది. ఇందుకుగాను పేదలకు అండగా ఉన్న సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేసుకోవడం జరిగింది.

హాస్పిటల్ బిల్లును మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు చొరవతో రూ.21,000 సీఎంఆర్‌ఎఫ్ చెక్కు మంజూరు కాగా నత్తి మల్లేష్ చేతుల మీదుగా అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పం నత్తి మల్లేశ్ ముదిరాజ్, ఎంపీటీసీ నత్తి లావణ్య, బీజేపీ మాజీ మండల అధ్యక్షుడు నరేందర్ చారి, బీజేవైఎం నాయకులు కుమ్మరి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.