calender_icon.png 9 August, 2025 | 9:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లక్ష బిల్వార్చన

09-08-2025 01:42:17 AM

సదాశివపేట, ఆగస్టు 8 : సదాశివపేటలో వీరశైవ సమాజం, చౌకి మఠం శ్రీ జగద్గురు పంచాచార్య బసవ సేవా సదన్ లో శ్రీమద్ కాశీ జ్ఞాన సింహాసనాదీశ్వర శ్రీశ్రీశ్రీ 1008 చంద్రశేఖర శివాచార్య మహాస్వామి వారి శ్రావణమాస ధర్మ ప్రచార,అనుష్టాన,79 వ జన్మదినోత్సవానికి పురస్కరించుకొని 79 కలశ జలములచే పాదాభిషేకం, లక్ష బిల్వార్చన, సామూహిక పాదపూజ నిర్వహించినట్లు అధ్యక్షులు  చీల మల్లన్న తెలిపారు.

అదేవిధంగా జగద్గురువుల జన్మదినోత్సవాన్ని పరిష్కరించుకొని విశ్వనాధ్ శాస్త్రి ఆధ్వర్యంలో  మంటపారాధన, మృత్యుంజయ హవనం, ఒక లక్ష జపం నిర్వహించినట్లు ప్రధాన కార్యదర్శి పిల్లోడే విశ్వనాథం వెల్లడించారు. ఈ కార్యక్రమంలో శివాచార్యులు గురు సిద్ధ మణికంఠ శివాచార్య, జ్ఞానసిద్ధ ఓంకార్ శివాచార్య మహాస్వామి, మరియు మల్లికార్జున స్వామి జగద్గిరిగుట్ట వేదాగామ పాఠశాల ప్రధానా చార్యులు, సంగయ్య స్వామి వేధాగమ పాఠశాల షాద్నగర్ ప్రధాన చార్యులు, జంగం మహేష్ స్వామి, పురాణం నాగయ్య స్వామి హైదరాబాద్, విజయ్ స్వామి, ఉపాధ్యక్షులు కోవూరి విజయకుమార్, గంతల బసవరాజ్, సి,హె రాములు సమాజం గౌరవ సభ్యులు  జగద్గురు పంచాయతీ మహిళా సంఘం సభ్యులు పాల్గొన్నారు.