calender_icon.png 22 November, 2025 | 6:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భావితరాల మనుగడకు మొక్కలు నాటాలి..

22-11-2025 06:04:22 PM

సుల్తానాబాద్ ఇంచార్జ్ ప్రిన్సిపాల్ శ్రీధర్.. 

సుల్తానాబాద్ (విజయక్రాంతి): భావితరాల మనుగడకు విద్యార్థులు మొక్కలు నాటాలని సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇంచార్జ్ ప్రిన్సిపాల్ జి. శ్రీధర్ అన్నారు. శనివారం సుల్తానాబాద్ గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో పెద్దపల్లి మై భారత్, స్పోర్ట్స్ క్లబ్ సుల్తానాబాద్ ఆధ్వర్యంలో 'ఏక్ పేడ్ మా కే నామ్' కార్యక్రమం నిర్వహించారు. కళాశాల విద్యార్థులు కళాశాల మైదానంలో మొక్కలు నాటారు. అనంతరం విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాస పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు.

కార్యక్రమంలో ఇంచార్జ్ ప్రిన్సిపాల్ జి.శ్రీధర్ మాట్లాడుతూ ప్రతీ ఒక్కరు విధిగా మొక్కలు నాటాలన్నారు. భావితరాల మనుగడకు మొక్కలను నాటి పెంచాల్సిన అవసరం ఉన్నదని, పచ్చదనం పెంపొందించడంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ సిహెచ్ ప్రభాకర్, స్పోర్ట్స్ ఇంచార్జి కే.సునిల్, మాధవిలత, దేవేందర్, నిర్మల, అరుణ, రాజేందర్, అర్జున్, రాజశేఖర్, విక్రమాదిత్య, శ్రీనివాస్, వంశీ, మమత మరియు యువకులు పాల్గొన్నారు.