calender_icon.png 22 November, 2025 | 6:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శాస్త్రీయ పద్ధతిలో తేనెటీగల పెంపకం ఉత్తమం

22-11-2025 06:12:23 PM

ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ ఐత ప్రకాష్ రెడ్డి..

కాటారం (విజయక్రాంతి): రైతులు వ్యవసాయంతో పాటు అదనపు ఆదాయ మార్గాలను ఎంచుకోవాలని, అందులో భాగంగా తేనెటీగల పెంపకం అనేది చాలా ఉత్తమమని రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ ఐత ప్రకాష్ రెడ్డి అన్నారు. కాటారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పంతకాని తీర్మాల సమ్మయ్య వారి ఆధ్వర్యంలో జరుగుతున్న తేనెటీగల పెంపకం శిక్షణ తరగతులలో భాగంగా శనివారం రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ ఐత ప్రకాష్ రెడ్డి సందర్శించారు.

ఈ సందర్బంగా రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ శాస్త్రీయ పద్దతిలో పెంపకం ద్వారా స్థిరమైన ఆదాయ వనరుగా ఉంటుందని రైతులకు సూచించారు. అలాగే తేనెటీగల పెంపకం నిర్వహణకు అయ్యే ఖర్చు కూడా  ఎన్ బి బి  ద్వారా సబ్సిడీ పొందే అవకాశం ఉంటుందని రైతులకు సూచన చేశారు. ఎన్ బి బి సహకారంతో శిక్షణ ఇస్తున్న సంజనతో పాటు సిబ్బందినీ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్ పర్సన్ పంతకాని తీర్మాల సమ్మయ్య, కుంభం రమేష్ రెడ్డి, పంతకాని సమ్మయ్య, మరపాక రాజేంద్ర ప్రసాద్, వెంకయ్య, ఖలీల్ పాషా, శిక్షణ నిర్వహుకులు సంజన, రఘు, ఎన్ బి బి  సిబ్బంది జ్యోతి, రైతులు తదితరులు పాల్గొన్నారు.