calender_icon.png 22 November, 2025 | 6:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అటవీ సంపదను కార్పొరేట్ సంస్థలకు దోచి పెట్టడం కోసమే నక్సల్స్ ఏరివేత

22-11-2025 06:00:44 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): కోట్లాది రూపాయల విలువైన ఖనిజ సంపదను ప్రధాని నరేంద్ర మోడీకి అత్యంత సహచరులలైన కార్పొరేట్ శక్తులు అంబానీ, అదానీ లాంటి వాళ్లకు దోచిపెట్టడంలో భాగమే అమిత్ షా నాయకత్వంలో ఆదివాసీలను, మావోయిస్టులను పట్టుకొని కాల్చి చంపుతున్నారని ఆరోపిస్తూ, ఇది దేశ, ప్రజా ద్రోహమని వెంటనే మనుషులను చంపే ఆపరేషన్ కగార్ ను, బూటకపు ఎన్ కౌంటర్ లను ఆపివేయాలని సీపీఐ ఎం.ఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ మండల వెంకన్న డిమాండ్ చేశారు. సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా మహబూబాబాద్ పట్టణంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం ముందు బూటకపు ఎన్ కౌంటర్ లను, ఆపరేషన్ కగార్ ను వెంటనే ఆపాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఎం.ఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా కామ్రేడ్ మండల వెంకన్న, తెలంగాణ ప్రజా ఫంట్ బాధ్యులు కిషన్ నాయక్ లు మాట్లాడుతూ ఆదివాసీ బిడ్డలను, మావోయిస్టులను పట్టుకొని కాల్చి చంపుతున్న పరిస్థితులలో అడవిలో పక్షులు, జంతు జీవరాశులు దుక్కిస్తున్నాయని, ప్రధానిమోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా లకు మాత్రం ఏ కోశానా మానవత్వం లేకుండా మారణకాండ ను కొనసాగించడం దుర్మార్గమైనదని, ఇది ఆటవిక చర్య కంటే దారుణమైనదన్నారు. మోడీ, అమిత్ షా లు అప్రజాస్వామిక చర్యలను తీవ్రంగా ఖండిస్తూ ముందుకు రావాలని ప్రజలకు, ప్రజాస్వామిక వాదులకు, మేధావులకు విద్యార్థి యువతరానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు లింగన్న, చారి హరీష్, డివిజన్ నాయకులు సామ పాపయ్య, వివిధ ప్రజా సంఘాల నాయకులు మునిత, ఏకాంబరం, ముత్తయ్య, సునీత, యాకూబ్ బి, భావుసింగ్, శ్రీను, షాబుద్దీన్, పుష్ప తదితరులు పాల్గొన్నారు.