15-07-2025 12:21:40 AM
కొడుకుల నుండి ప్రాణహాని ఉందని పోలీసులను వేడుకున్న భద్రమ్మ..
ముషీరాబాద్, జూలై 14 (విజయక్రాంతి): కన్న కొడుకుల నుండి ప్రాణహాని ఉందని, తనకు రక్షణ కల్పించాలని ఓ వృద్ధ తల్లి రోధిస్తూ పోలీసులను వేడుకుంది. ఈ మేరకు సోమవారం బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మల్కాజ్‌గిరికి చెందిన భద్రమ్మ(67) తన గోడును వెళ్లబోసుకుంది.
తన భర్త కష్టపడి సంపాదించిన ఆస్తిని తన కొడుకులు అనిల్, వినయ్ లు అక్రమంగా ఆక్రమించుకొని తనను రోడ్డుపాలు చేశారని కన్నీరు పెట్టుకుం ది. తన కూతురు చేరదీయక పోతే అడుక్కొని బ్రతకాల్సిన పరిస్థితి వచ్చేదని ఆ వేదన వ్యక్తం చేసింది. రూ.3 కోట్ల విలు వ చేసే ఆస్తిని కాజేయలని నకిలీ పత్రాలను సృష్టించారని భద్రమ్మ తెలిపింది.
దీనిపై మల్కాజ్‌గిరి పోలీస్ స్టేషన్‌లో తన కొడుకులపై ఫోర్జరీ కేసు నమోదు చేసినప్పటికీ ఇంతవరకు వారిపై ఎలాం టి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించింది. తనను ఎలాగైనా అంతమొందిం చి ఆస్తిని కాజేయాలని చూస్తున్నారని వాపోయింది. తన కొడుకులు అనిల్, వినయ్‌లపై చర్యలు తీసుకొని తనకు రక్షణ కల్పించాలని భద్రమ్మ పోలీసులను వేడుకుంది.