calender_icon.png 15 July, 2025 | 5:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిరుపేదలకు సంక్షేమ పథకాలు అందాలి

15-07-2025 12:22:55 AM

జనగామ, జూలై 14 (విజయ క్రాంతి):  రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టే వివిధ సంక్షేమ పథకాల అమలులో జిల్లా అధికారులు పూర్తిగా భాగస్వామ్యమై... అర్హులైన ప్రతి ఒక్కరికి  సంక్షేమ పథకాల ఫలాలను అందించాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ అన్నారు. సోమవారం గ్రీవెన్స్ కార్యక్రమం అనంతరం వివిధ అంశాల పైన  శాఖల వారీగా జిల్లాస్థాయి అధికారులతో కలెక్టర్ రివ్యూ చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నియోజకవర్గస్థాయిలో జరిగే ఇందిరా మహిళా శక్తి సంబరాలు ఘనంగా జరిగేలా మండల స్పెషల్ అధికారులు పర్యవేక్షణ చేయాలన్నారు అలాగే రేషన్ కారడ్స్ పంపిణి  ప్రక్రియ సజావుగా జరగాలని.. ఎక్కడ  ఎలాంటి ఇబ్బంది తలెత్తకూడదన్నారు  ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్ వేగవంతం కావాలన్నారు  వన మహోత్సవం కార్యక్రమం చాలా గ్రాండ్ గా జరగాలన్నారు మన జిల్లా లో  సరిపడ యూరియ ఉన్నదని.. ఎక్కడ కూడా కొరత అనే సమస్య రావద్దన్నారు. 

టిబి ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం పక్కాగా జరగాలని, సీజనల్ వ్యాధులు రాకుండా వివిధ శాఖల అధికారులు సమన్వయంగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు అలాగే రెవెన్యూ శాఖకు సంబంధించి భూ భారతి సదస్సు లో వచ్చిన దరఖాస్తుల క్షేత్ర స్థాయి విచారణ పూర్తి కావాలన్నారు     అధి కారులు వారి వారి బాధ్యత లను,విధులను సజావుగా నిర్వర్తిస్తు .. జిల్లా కి మంచి పేరు తెచ్చేవిధంగా కృషి చేయాలన్నారు. అదనపు కలెక్టర్లు పింకేష్ కుమార్, రోహిత్ సింగ్,స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ లు, ఆర్డీవోలు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.