31-07-2025 01:32:25 AM
వారణాసిలో నిధులు విడుదల చేయనున్న ప్రధాని నరేంద్ర మోదీ
న్యూఢిల్లీ, జూలై 30: దేశంలోని రైతులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబు రు అందించింది. పీఎం కిసాన్ యో జన 20వ విడత వాయిదా సొమ్ము ఆగస్టు 2న రైతుల ఖాతాల్లో జమ కానుంది. వారణాసిలో జరిగే కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా నిధులు విడుదల చే యనున్నారు.
రాష్ట్రంలో 41.58 లక్ష ల రైతు కుటుంబాలకు రూ.831.60 కోట్లు అందుతాయి. పీఎం కిసాన్ నుంచి రూ.2 వేలు రైతుల ఖాతాల్లో జమకానున్నాయి. 2019లో ప్రారంభించిన ఈ పథకంలో భాగంగా రైతుల ఖాతాల్లో 6 వేలు జమచేసే కేంద్రం మూడు విడతల్లో రూ. 2వేల చొప్పున విడుదల చేస్తుంది.