31-07-2025 01:34:14 AM
ఢిల్లీ, జూలై 30: జమ్ము కశ్మీర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతయమ్యారు. ఈ ఘట న పూంచ్ జిల్లాలో జరి గింది. బుధవారం ఉదయం పూంచ్ సెక్టార్‌లోని జెన్ ప్రాంతంలో ఉన్న కంచె వెంబడి ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదం గా తిరుగుతుండడంతో భద్రతా దళా లు గుర్తించి వెంటనే అప్రమత్తమయి కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు చనిపోయారు.
మృతి చెందిన టెర్రరిస్టులను లష్కర్ ఏ తోయిబాకు చెందినవారుగా భావిస్తున్నారు. ఆ ప్రాంతంలో ఇంకా ఎవరైనా ఉగ్రవాదులు ఉన్నారేమోనని సెర్చ్ ఆపరేషన్‌ను భద్రతాదళా లు నిర్వహిస్తున్నాయి. భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించిన ఇద్ద రు ఉగ్రవాదులను భద్రతా బలగా లు ఎన్‌కౌంటర్ చేశాయని జమ్ముకశ్మీర్ డీజీపీ నళినీ ప్రభాత్ ప్రకటించా రు.
ఈ మేరకు ఎన్‌కౌంటర్ వివరాలను ఎక్స్ వేదికగా ఆర్మీకి చెందిన వైట్‌నైట్ కార్ప్స్ వెల్లడించింది. కాగా పహల్గాం దాడిలో పాల్గొన్న ముగ్గు రు ఉగ్రవాదులను ఆపరేషన్ మహదేవ్ ద్వారా సోమవారం దాచిగామ్ నేషనల్ పార్క్‌లో భద్రతా దళాలు ఎన్‌కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే.