28-11-2025 12:03:50 AM
---ప్రశ్నించేవారిపై బ్రహ్మస్రం ప్రయోగిస్తానన్నా గత ప్రధానోపాధ్యాయుడు
--జిల్లా అధికారులు విచారణ చేపట్టాలని గ్రామస్థుల డిమాండ్
మంగపేట,ములుగు, నవంబర్27(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో పేద,బడుగు, బల హీన వర్గాల విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న పీఎంశ్రీ జడ్పీహెచ్‌ఎస్ రాజుపేట ఉన్నత పాఠశాల 2023-24 విద్యా సంవత్సరానికి సెలెక్ట్ అయిన విషయంలో రెండో సంవత్సరంలో 2024-25 విద్యాసంవత్సరానికి గాను మొదటి విడతగా కేంద్ర ప్రభుత్వం నుండి పిఎంశ్రీ జడ్పీహెచ్‌ఎస్ రాజపేట ఉన్నత పాఠశాల అభివృద్ధిలో భాగంగా 20 కాంపోనెంట్ల విడతలవారీగా నిధులు 16,16,140/-( 16 లక్షల రూపాయలు) మంజూరు చేయగా అప్పుడున్న పాఠశాల ప్రధానోపాధ్యాయులు తన బ్రహ్మాస్త్రంను ఉపయోగించుకుంటూ సరైన నిధులను కాంపోనెంట్ల వారిగా ఖర్చు పెట్టకుండా అంతంత మాత్రమే ఖర్చుపెట్టి, స్టాఫ్ కు తప్పుడు లెక్కలు చూపించి, ఉపాధ్యాయులకు కాంపోనెంట్ల వారీగా శాఖలో బాధ్యతలు చూపించుకుంటూ అట్టి నిధులను వారికి చూపించకుండా సొంతగా అందులో 20 శాతం వరకు తన జేబులో వేసుకొన్నారని పలువురు ఉపాధ్యాయులు చర్చించుకొంటున్నారు.
ఇందులో భాగంగా పాఠశాలకు సెంట్రల్ లైటింగ్ విషయంలో 50,000/- ఖర్చుపెట్టకుండా, కరాటే మాస్టర్ నిధులు సగం స్వహ చేశారు అని విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. ఎక్స్పోజర్ విజిట్ కింద రెండు లక్షలు ఖర్చు పెట్టినట్టు చూపించి అట్టి విషయం స్టాఫ్ కి తెలియకుండా చేశారు అయినా కూడా అన్ని పనులను పూర్తి చేయకుండా ఆడిట్ ను మాత్రం పూర్తి చేసుకున్నారు తన ఇష్టానుసారంగా ఖర్చుపెట్టి తప్పించుకున్నారు అని వారు అంటున్నారు.
పాఠశాలకు ఏ బడ్జెట్ వచ్చిన పాఠశాల స్టాప్ కు మీటింగ్ పెట్టి అందరికీ తెలియపరిచే విధంగా చేయాలి కానీ ఇతను అలా చేయలేదు అని సమాజానికి, ఉపాధ్యాయులకి తెలియపరిచే విధంగా చేయాలి కానీ ఇతను అలా చేయలేదు అని ఈ విషయము చాలాసార్లు స్థానిక విలేకరులు ప్రశ్నించగా సరైన సమాచారం రాలేదు అన్నారు. కావున ఈ విషయంపై పూర్తిగా పరిశీలింప చేసి జిల్లా అధికారులు పాఠశాల విద్యార్థులకు తమకు కనీసం మౌలిక వసతులు కల్పించే విధంగా న్యాయం చేయాలని తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కోరుతున్నారు.