calender_icon.png 11 July, 2025 | 8:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పీఎంవో డైరెక్టర్ హైదరాబాద్ పర్యటన

11-07-2025 12:02:50 AM

‘-డబుల్’ ఇళ్ల నిర్మాణాలపై మన్మీత్ కౌర్ పరిశీలన 

హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై 10 (విజయక్రాంతి): ప్రధాన మంత్రి కార్యాలయ డైరెక్టర్ మన్మీత్‌కౌర్ రెండు రోజుల హైదరాబాద్ పర్యటలో రెండోరోజైన గురువారం జీహెచ్‌ఎంసీ పరిధిలోని పలు డబుల్ ఇళ్ల నిర్మాణ ప్రాజెక్టులను పరిశీలించారు. కోల్లూరు ఫేస్-2లో నిర్మించిన 15,660 గృహాలు, దూలనాగపల్లిలో నిర్మించిన 1,544 గృహాలను స్వయంగా సందర్శించారు.

ఆమె వెంట జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వి కర్ణన్, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ పి ప్రవీణ్, హౌసింగ్ శాఖ ఇంజనీరింగ్ అధికారులు ఉన్నారు. కొల్లూరులో అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, హెల్త్ సెంటర్లు గురించి లబ్ధిదారుల అభిప్రాయాలు స్వీకరించారు. కాగా బుధవారం న్యూఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన డైరెక్టర్‌కు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఇలంబర్తి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వి కర్ణన్, హౌసింగ్ ఎండి గౌతమ్ స్వాగతం పలికారు. బుధవారం సాయంత్రం ఆమె హౌసింగ్  మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులతో సెక్రటేరియట్‌లో సమీక్ష చేశారు.