11-07-2025 12:00:00 AM
- సింగపూర్‌లోని జీఐఐఎస్‌లో చదువుకోనున్న దువా అహ్మద్ షెరీఫ్
హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై 10 (విజయక్రాంతి): గ్లోబల్ ఇండియన్ ఇంటర్నే షనల్ స్కూల్ (జీఐఐఎస్) తన ప్రతిష్టాత్మక గ్లోబల్ సిటిజన్ స్కాలర్షిప్ తాజా గ్రహీతలను ఢిల్లీలోని ఏరోసిటీలో గురువారం సన్మానించింది. జీసీఎస్ అనేది ప్రపంచ స్థాయి విద్య ద్వారా తెలివైన యువతకు సాధికారత కల్పించే ఒక ప్రధాన కార్యక్రమం. ఈ సంవత్సరం ఎంపికైన 10 మంది అసాధారణ స్కాలర్లలో హైదరాబాద్‌కు చెందిన దువా అహ్మద్ షెరీఫ్ ఉన్నారు. ఆమె తన విద్యా నైపుణ్యం, నాయకత్వ సామర్థ్యంతో అందరిలోనూ ప్రత్యేకంగా నిలిచారు.
దువా ఇప్పుడు సింగపూర్‌లోని జీఐఐఎస్ స్మార్ట్ క్యాంపస్‌లో పరివర్తనాత్మక విద్యా ప్రయాణాన్ని ప్రారంభించనుంది. ఈ స్కాలర్‌షిప్ రెండేళ్ల కీలకమైన సీనియర్ సెకండరీ విద్య (11, 12 తరగతులు) ట్యూషన్ ఫీజులు, బోర్డింగ్, జీవన వ్యయాలను 100శాతం కవర్ చేస్తుంది. మొత్తం ఖర్చు రూ.1 కోటి ఉంటుంది. దీనికి పూర్తిగా జీసీఎస్ ప్రోగ్రామ్ నిధులు సమకూరుస్తుంది.