09-07-2025 12:00:00 AM
బాన్సువాడ, జూలై 8 ః ఆషాఢ మాసం సందర్భంగా తన సొంత గ్రామం పోచారంలో సతీ సమేతంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి బోనం ఎత్తుకుని గ్రామదేవత నల్ల పోచమ్మ ఆలయంలో బోనం సమర్పించారు.
పోచారం దంపతులు బాన్సువాడ మండలం పోచారం గ్రామంలో ఆషాఢ మాసం బోనాల పండుగలో భాగంగా మంగళవారం తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి పుష్ప,సోదరుడు పోచారం శంభురెడ్డి ,ప్రేమల తో పాటు ఈ బోనాల ఉత్సవాలలో బాన్సువాడ మండల నాయకులు, పోచారం గ్రామస్థులు పాల్గొన్నారు.