calender_icon.png 9 July, 2025 | 8:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరదజలాలే వాడుతం

09-07-2025 12:00:00 AM

బనకచర్లపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు

హైదరాబాద్, జూలై 8: బనకచర్ల నిర్మాణంపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. గోదావరి నుంచి సముద్రంలో కలిసే నీటిని వాడుకుంటే తప్పులేదని పేర్కొన్నారు. శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి మంగళవారం ఆయన దిగువకు నీటిని విడుదల చేశారు. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. రాయలసీమను రతనాల సీమ చేయాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.

ఈ ప్రాంతంలో కరువు లేకుండా చేసే బాధ్యత తమదేనని హామీ ఇచ్చారు. రిజర్వాయర్లు ఆధునిక దేవాలయాలని పేర్కొన్నారు. 2019లో టీడీపీ గెలిచి ఉంటే.. ఇప్పటికే పోలవరం ప్రాజెక్ట్ పూర్తయ్యేందని తెలిపారు. సాగునీటిలో పేటెంట్ కచ్చింగా టీడీపీ, ఎన్డీఏ ప్రభుత్వానిదేనన్నారు. సముద్రంలోకి వెళ్లే నీటిని తెలుగు రాష్ట్రాలు వాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. గోదావరి వల్లే రాయలసీమకు సాగునీరు వస్తుందని పేర్కొన్నారు.

ప్రస్తుత కృష్టా డెల్టాకు గోదావరి ద్వారా నీళ్లు ఇస్తున్నామని అన్నారు. గోదావరి నుంచి 2 వేల టీఎంసీలు సముద్రంలోకి వెళ్తున్నాయని, అందులో 200 టీఎంసీలు వాడుకున్నా రాయలసీమలోని అనేక ఎకరాలను సాగులోకి తీసుకురావచ్చని చెప్పారు. తెలంగాణ కూడా గోదావరి నీటిని వాడుకోవచ్చని సీఎం చంద్రబాబు వివరించారు.