calender_icon.png 1 September, 2025 | 10:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా గణేశుని నిమజ్జనం

01-09-2025 06:55:29 PM

మోతే: సూర్యాపేట జిల్లా(Suryapet District) మోతే మండల కేంద్రంలోని హైదరాబాద్ పబ్లిక్ పాఠశాలలో ఏర్పాటుచేసిన గణనాథుడి నిమజ్జన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అనంతరం పాఠశాల కరస్పాండెంట్ గుండ్లపల్లి నాగేశ్వరరావు మాట్లాడుతూ, చదువుతో పాటు భక్తి కూడా అవసరమని తల్లిదండ్రులతో పాటు గురువులను కూడా పూజించాలని అలాగే భక్తిని కూడా అలవర్చుకోవాలని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ అనిల్ కుమార్, ఉపాధ్యాయని ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.