calender_icon.png 23 September, 2025 | 11:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీఎస్టీ 2.0పై ప్రజలు, వ్యాపార వాణిజ్య వర్గాలు సంతోషంతో ఉన్నారు

23-09-2025 07:11:29 PM

బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ప్రోగ్రాం కన్వీనర్ గుగ్గిల్లపు రమేష్

కరీంనగర్,(విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం ఈనెల 22 నుంచి అమల్లోకి వచ్చిన  గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్  పన్నుల  తగ్గింపులు దేశ ఆర్థిక విధానానికి, వినియోగదారుల ఖర్చులలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలకనున్నాయని,  జీఎస్టీ 2.0 పై ప్రజలు , వ్యాపార వాణిజ్య వర్గాలు సంతోషంతో ఉన్నారని   బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు,  మాజీ డిప్యూటీ మేయర్   గుగ్గిలపు రమేష్  అన్నారు.  నూతన జిఎస్టి అమలైన నేపథ్యంలో కరీంనగర్ బిజెపి శ్రేణులు మంగళవారం పట్టణంలోని పలు వాణిజ్య, వ్యాపార కేంద్రాలను సందర్శించి, వ్యాపారులతో ముచ్చటించారు.

ఈ సందర్భంగా జీఎస్టీ ప్రోగ్రాం కన్వీనర్ గుగ్గిల్లపు రమేష్, కో కన్వీనర్లు సింగిరెడ్డి కృష్ణారెడ్డి, కన్న కృష్ణ, రంగు భాస్కరాచారిలు మాట్లాడుతూ...  గతంలో  ఉన్న నాలుగు పన్ను శ్లాబులను రద్దు చేసి, ఒక సరళమైన మూడుఅంచెల విధానాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిందని, నిత్యావసర వస్తువులకు 5 శాతం,  సాధారణ వస్తువులకు 18 శాతం, విలాసవంతమైన, హానికరమైన వస్తువులకు 40 శాతం తో జిఎస్టి వర్తించేలా  మార్పులు చేపట్టి, ప్రజలకు, వినియోగదారులకు మేలు జరిగేలా మోడీ ప్రభుత్వం చారిత్రక నిర్ణయం తీసుకుందన్నారు. ఈ నిర్ణయం వల్ల  భారతీయ ప్రజలందరికీ ,వినియోగదారులక, వ్యాపారాలకు నేరుగా ప్రయోజనం  చేకూర్చనుందన్నారు.