calender_icon.png 30 October, 2025 | 8:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలీసుల బైక్ ర్యాలీ

30-10-2025 05:21:56 PM

పాల్గొన్న ఎస్పీ కాంతిలాల్ పాటిల్ 

కుమ్రం భీం అసిఫాబాద్ (విజయక్రాంతి): పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు భాగంగా గురువారం జిల్లా కేంద్రంలో పోలీసులు బైక్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో ఎస్పీ కాంతిలాల్ పాటిల్, ఏఎస్పి చిత్తరంజన్ పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనాలు నడపాలని సూచించారు. రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు హెల్మెట్ ధరించకపోవడంతోనే ప్రాణనష్టం జరుగుతుందని అన్నారు. హెల్మెట్ ధరించడం కేవలం చట్టపరమైన బాధ్యత మాత్రమే కాదని మన ప్రాణాల రక్షణకు అవసరమని పేర్కొన్నారు. సమాజ భద్రత కోసం ప్రాణ త్యాగం చేసిన అమరవీరుల త్యాగాలు ఎప్పటికీ మరువలేనివని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది ,యువత పాల్గొన్నారు.