calender_icon.png 5 July, 2025 | 10:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాసరకు ప్రత్యేక బస్సు

05-07-2025 05:45:07 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): టీజీఎస్ఆర్టీసీ(TGSRTC) ఆధ్వర్యంలో గురు పౌర్ణమిని పురస్కరించుకొని ఈనెల 10వ తేదీన ఆసిఫాబాద్ నుండి బాసర(సరస్వతి అమ్మవారి)కి ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఎక్స్ ప్రెస్, సూపర్ లగ్జరీ బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అక్షరాభ్యాసం చేయించుకునే ప్రజలు ఈ అవకాశాన్న సద్వినియోగం చేసుకోవాలన్నారు. సరస్వతి అమ్మవారి దర్శనానికి వెళ్లే ప్రయాణికులకు మంచి అవకాశం అని తెలిపారు. ఈనెల 10వ తేదీన ఆసిఫాబాద్ నుండి ఉదయం 7 గంటలకు బయలుదేరుతుందని అదే రోజు సాయంత్రం 7 గంటలకు ఆసిఫాబాద్ చేరుకుంటుందని తెలిపారు. ఒక్కరికి టికెట్ రాను, పోను ఎక్స్ ప్రెస్ కు రూ. 800, సూపర్ లగ్జరీ కి రూ.1040 ధరలు నిర్ణయించినట్లు పేర్కొన్నారు. మరింత సమాచారం కోసం 9959226006 సంప్రదించాలని సూచించారు.