09-12-2025 10:32:39 PM
కుబీర్ (విజయక్రాంతి): కుబీర్ మండలంలోని ఆయా గ్రామాల్లో మంగళవారం పోలీసులు గుడుంబా నిర్వహిస్తున్న స్థావరాలపై దాడులు నిర్వహించారు. వివిధ తండాలో గుడుంబా విక్రయిస్తున్నట్లు సమాచారం తెలుసుకుని ఎస్సై కృష్ణ సాగర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు దాడులు నిర్వహించి తొమ్మిది వందల లీటర్ల గుడుంబాను ధ్వంసం చేసినట్లు తెలిపారు. గుడుంబాను విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తానూర్ మండలంలో వివిధ గిరిజన గ్రామాల్లో మంగళవారం సాయంత్రం పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించి అక్రమంగా నిల్వ ఉంచిన గుడుంబాలను పట్టుకున్నట్టు ఎస్సై నవనీత్ రెడ్డి తెలిపారు. గ్రామాల్లో గుడుంబా తయారు చేసిన విక్రయించిన వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.