09-12-2025 10:34:58 PM
జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్..
వెల్దండ: మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లను అభ్యర్థులు ఎవరైనా ప్రలోభాలకు గురిచేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ హెచ్చరించారు. మంగళవారం కల్వకుర్తి మున్సిపల్ పరిధిలోని కొట్ర గేటు వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ను ఆకస్మికంగా తనిఖీ చేసి మాట్లాడారు. వాహనాల తనిఖీల విధానాన్ని పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. జిల్లాలో మొదటి విడత ఆరు మండలాల్లో ఎన్నికలు జరుగుతున్నాయని ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. ప్రజలు నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.