09-12-2025 10:25:21 PM
ఉప్పల్ (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని మల్లాపూర్ కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మల్లాపూర్ ఎలిఫెంట్ కూడలి వద్ద కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసారు. ఈ సందర్భంగా మల్లాపూర్ డివిజన్ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన దేవత సోనియా గాంధీ అని కొనియాడారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ అభివృద్ధిలో దూసుకుపోతుందని అన్నారు. పేద ప్రజల అభివృద్ధి, సంక్షేమం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు కప్పరా సాయి గౌడ్ దంతురి రాజు గౌడ్ నేమిలి అనిల్ సవీ కిట్టు కృష్ణ రెడ్డి మహిళా నాయకులు పాల్గొన్నారు.