03-05-2025 06:03:59 PM
నిర్మల్ (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం డిగ్రీ కళాశాలలో 2025-28 విద్యా సంవత్సరం గాను ప్రవేశాల కోసం దోస్త్ అప్లికేషన్ ఆన్లైన్ విడుదల చేయడం జరిగిందని దాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ సుధాకర్ తెలిపారు. నిర్మల్ జిల్లాలో ఇంటర్ పాసైన విద్యార్థులు అందరూ కూడా డిగ్రీ కళాశాలలో ప్రవేశ పొందేందుకు అప్లికేషన్ చేసుకున్న వారికి మెరిట్ మార్కులు ఆధారంగా వివిధ కళాశాలలో ప్రవేశాలు ఉంటాయని ప్రభుత్వ కళాశాలలో నాణ్యమైన విద్య అందిస్తున్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఏ డిగ్రీ కళాశాలలోనైనా చేరేందుకు ఈ అప్లికేషన్ ఉపయోగపడుతుందని ఆయన వెల్లడించారు.