calender_icon.png 1 November, 2025 | 7:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలీసు ఉద్యోగం సవాళ్లతో కూడుకున్నది

01-11-2025 12:50:35 AM

కమిషనర్ సుధీర్ బాబు

రాచకొండ అక్టోబర్ 31(విజయక్రాంతి) పోలీసు ఉద్యోగం  ఎన్నో సవాళ్లతో కూడుకున్నదని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు అన్నారు. విధి నిర్వహణలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఎంతో కాలం పాటు పోలీసుశాఖలో సమర్థవంతం గా, క్రమశిక్షణతో పనిచేస్తూ  పదవీ విర మణ పొందిన అధికారులను కమీషనర్  అభినందిస్తూ, సత్కరించారు.

రాచకొండ పోలీస్ కమిషనరేట్ లో పదవీ విరమణ ఐదుగురు సబ్ ఇన్స్పెక్టర్లు  మహిపాల్ రెడ్డి, ఉప్పల్ ట్రాఫిక్ పీఎస్, రవీంద్రరెడ్డి, పోలీస్ కంట్రోల్ రూమ్, లాలయ్య, పోలీస్ కంట్రో ల్ రూమ్,  రాజేశ్వర్, హయత్ నగర్ పీఎస్,  ఆనంద్ నాయక్, యాదగిరిగుట్ట పీఎస్ లను సీపీ  సుధీర్ బాబు,  రాచకొండ పోలీస్ కార్యాలయంలో సన్మానించారు. ఈ సందర్భంగా సీపీ గారు మాట్లాడుతూ పదవీ విరమణ అనంతరం విశ్రాంత జీవితాన్ని ప్రశాంతంగా గడపాలని, ఆరోగ్యం పట్ల అధిక శ్రద్ధ చూపాలని, పెన్షన్ మరియు ఇతర ఆర్థిక అంశాల పట్ల క్రమశిక్షణ పాటించాలని సూచించారు.

వారికి రావాల్సిన అన్ని రకాల ప్రయోజనాలు త్వరగా వచ్చే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.  ఈ కార్యక్రమంలో అడ్మిన్ డీసీపీ ఇందిరా, అడిషనల్ డీసీపీ అడ్మిన్ శివ కుమార్, సీసీఆర్బీ ఏసిపి రమేష్, సిఏఓ అడ్మిన్ పుష్ప రాజ్, ఎఎఓ అశోక్ రెడ్డి, పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు సిహెచ్. భద్రా రెడ్డి,  కో ఆపరేటివ్ డైరెక్టర్ సువర్ణ పాల్గొన్నారు.