calender_icon.png 1 November, 2025 | 7:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రపంచ తెలుగు మహా సభలకు రండి

01-11-2025 12:49:14 AM

త్రిపుర గవర్నర్‌ను ఆహ్వానించిన ఆంధ్ర సారస్వత పరిషత్తు అధ్యక్షుడు గజల్ శ్రీనివాస్ 

హైదరాబాద్, అక్టోబర్ 31 (విజయక్రాంతి): ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యం లో 2026 జనవరి 3 నుంచి 5వ తేదీవరకు గుంటూరులోని అమరావతి శ్రీ సత్యసాయి స్పిరచువల్ సిటీ ప్రాంగణం(హైవే)లో శ్రీ నందమూరి తారకరామారావు వేదికపై  నిర్వహించే 3వ ప్రపంచ తెలుగు మహాసభలలో జనవరి 4న సాయంత్రం  నిర్వహించే ‘తెలుగు వైభవ పురస్కారాలు’ సభకు ముఖ్య అతిథిగా రావాలని త్రిపుర గవర్నర్ ఎన్ ఇంద్రసేనారెడ్డిని ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షుడు డాక్టర్ గజల్ శ్రీనివాస్ హైదరాబాద్‌లో కలసి ఆహ్వానించారు. తప్పక ప్రపంచ మహా సభలలో పాల్గొంటానని, మాతృ భాషను నిలబెట్టు కోవడం తెలుగు వారి అందరి బాధ్యత అని ఇంద్రసేనారెడ్డి అన్నారని గజల్ శ్రీనివాస్ తెలిపారు.