18-01-2025 12:11:00 AM
భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్యదేశం. ప్రజాస్వామ్య మనుగడ అనేది గతిశీలక మైన చైతన్యమైన రాజకీయ వ్యవస్థ ఉన్నప్పుడే సాధ్యమవుతుంది. దురదృష్ట వశాత్తు ప్రజాప్రతినిధుల్లో చాలామందికి చట్టాల పట్ల , పరిపాలన నిర్వహణపై అవ గాహన ఉండడం లేదు. దీంతో ఆశించిన ఫలితాలు రావడంలేదు. పాఠశాల స్థాయిలో లేదా కళాశాల స్థాయిలో రెండు సంవత్సరాల పూర్తికాలపు రాజకీయ అవగాహన కొరకు కరికులం రూపొందించి అకడమిక్ బోధన చేయాలి.
దీంతో రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్న యువత వాటిల్లో చేరి భవిష్య త్తులో రాజకీయాల్లో రాణించే అవకాశానికి ఒక భూమికగా తోడ్పడుతుంది. దేశంలో ఆన్‌లైన్‌లో కూడా అనేక కోర్సులకు, వృత్తులకు శిక్షణ సంస్థలు ఉన్నాయి. కానీ రాజకీయ శిక్షణ ఇచ్చే సంస్థలు లేవు. అందుచేత ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన మన దేశంలో వీటి నెలకొ ల్పితే రాజ యపరమైన శిక్షణ పట్ల ఆసక్తి ఉన్న యువకులు చేరడానికి అవకాశం ఏర్పడుతుంది.
దీంతో చైతన్యమైన యువత, చైత న్యమైన రాజకీయ వ్యవస్థ ఏర్పడి ప్రజాస్వామ్యం మనగలుగుతుం ది. అందుచేత అటువైపు ప్రభుత్వాలు ఆలో చించవలసిన ఆవశ్యత ఉంది. మంచి వక్త కావడానికి వ్యాపార దృక్పథంతో టీవీలు శిక్ష ణా సంస్థలు ఏర్పాటు చేస్తున్నాయి. కానీ రాజకీయ నిర్వహణ పట్ల పరిపూర్ణ జ్ఞానం సాధించడానికి రాజకీయ శిక్ష ణా సంస్థలు ఎంతయినా అవసరం.
ఉమాశేషారావు వైద్య, కామారెడ్డి
సమాచార కమిషనర్లను నియమించాలి
సమాచార హక్కు చట్టం ప్రజల చేతిలో ఆయుధం లాం టిది.పాలనలో పారదర్శకత, జవాబు దారీతనం పెంచే సమాచార హక్కు అమలు తీరుకు సంబంధించిన రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్, కమీషనర్ పోస్టులు ఖాళీగా ఉండటంత్లో రాష్ట్ర సమాచార కమిషన్‌లో లక్షలాది రెండవ అప్పీలులు పెండింగ్‌లో వుం డటం వల్ల, ప్రజలకు కావలసిన సమాచారం సకాలంలో రాక పో వడం వల్ల సమాచార హక్కు చట్టం అమలు సక్రమంగా జరగడం లేదు.
అనేక ప్రభుత్వ కార్యాలయాలలో సమాచార హక్కు చట్టం బోర్డులు కూడా లేవు. మూలకు పడవేసి వుంచారు. అధికారులకు అవగాహన లేదు. ప్రభుత్వం తక్షణమే స్పందించి సమాచార హక్కు చట్టం అమలు తీరు మెరుగు పరిచేందుకు కృషి చేస్తూ సమాచార హక్కు కమీషనర్ పోస్టులను భర్తీ చేయాలి.ప్రతీ ప్రభు త్వ కార్యాలయాల గోడల మీద బోర్డ్‌లు ఏర్పాటు చేసి అధికారులకు చట్టం అమలు తీరు మీద శిక్షణ ఇవ్వాలి.
కామిడి సతీష్ రెడ్డి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా.