calender_icon.png 30 January, 2026 | 9:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

'లోహిత్ సాయి'లో క్యాన్సర్ ఉచిత వైద్య శిబిరం

30-01-2026 07:52:44 PM

సిద్దిపేట క్రైం: లోహిత్ సాయి సూపర్ స్పెషాలటీ హాస్పిటల్  చైర్మన్ డాక్టర్ భాస్కర్, మల్లారెడ్డి  నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం క్యాన్సర్ ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఆస్పత్రి ఆవరణలో నిర్వహించిన ఈ శిబిరాన్ని మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల, వైస్ చైర్మన్ జంగిటి కనకరాజు ప్రారంభించారు. ఈ శిబిరంలో వైద్యులు డాక్టర్లు శ్రీవల్లి, మహేష్ కుమార్, మేఘన, వినయ్ కుమార్ లు సుమారు 500 లకు పైగా రోగులను పరీక్షించారు. అందులో 160 మందికి  యూఎస్జీ స్కాన్స్, 30 మందికి మమోగ్రఫీ, 10 మందికి పాప్స్మియార్ , 120 2డీ ఏకోస్ ఇతర పరీక్షలు చేశారు. హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ శైలజ భాస్కర్, మేనేజర్లు చంద్ర శేఖర్, శ్రీధర్, శ్వేత సంతోష్, రమేశ్, మల్లారెడ్డి నారాయణ మేనేజర్ మల్లారెడ్డి, పీఆర్వో లు, సిబ్బంది పాల్గొన్నారు.