calender_icon.png 31 January, 2026 | 1:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సుల్తానాబాద్ మున్సిపల్ పై బీజేపీ జెండా ఎగురావేస్తాం

30-01-2026 08:01:03 PM

ఎమ్మెల్సీ మల్క కొమురయ్య

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ పై బిజెపి జెండా ఎగరవేయటం ఖాయమని ఎమ్మెల్సీ మల్కా కొమురయ్య అన్నారు. శుక్రవారం  పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపాలిటీలో  పర్యటన చేసి, రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల భారీ గెలుపే లక్ష్యంగా పార్టీ నేతలు, కార్యకర్తలతో ఎమ్మెల్సీ మల్క కొమురయ్య విస్తృత చర్చలు జరిపారు.

ప్రజా సమస్యలే అజెండాగా ఇంటింటా ప్రచారం, బూత్ కమిటీల బలోపేతం, కార్యకర్తల సమన్వయంతో విజయదిశగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంతో పాటు, మున్సిపాలిటీ అభివృద్ధికి స్పష్టమైన ప్రణాళికతో బిజెపి ముందుకు సాగుతుందని అన్నారు, ఈ కార్యక్రమంలో నాయకులు  సౌదరి మహేందర్ యాదవ్, కందుల శ్రీనివాస్, కూకట్ల నాగరాజు, 15వార్డుల ఆశవహులు బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు..