calender_icon.png 30 January, 2026 | 9:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాజీ సీఎం కేసీఆర్ పైనా సిట్ విచారణ దారుణం

30-01-2026 07:14:19 PM

ఇది ముమ్మాటికి కక్ష సాదింపు చర్యనే: కే యూ BRSV

కాకతీయ యూనివర్సిటీ,(విజయక్రాంతి): కేయూ ఇంచార్జి డా.జట్టి రాజేందర్ మాట్లాడుతూ... ఇది ముమ్మాటికి ప్రజా పాలన ప్రభుత్వం కాదు ప్రతికార పాలన ప్రభుత్వం. కెసిఆర్ కి సిట్ పేరుతో నోటీసులను పంపడంను తీవ్రంగా ఖండిస్తున్నాం ఈరోజు  కాకతీయ యూనివర్సిటీ మొదటి గేట్ వద్ద నల్ల బ్యార్జీలు ధరించి నిరసన వేక్తం చేయడం జరిగింది అనంతరం బీఆర్ఎస్ బీఆర్ఎస్వి నాయకులు కెసిఆర్ కి సీట్ నోటీసులు పంపడాన్ని తీవ్రంగా ఖండించార.

రాష్ట్రంలో రోజురోజుకు రేవంత్ సర్కార్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే సహించేది లేదని, ఈ రేస్ పేరుతో కేటీఆర్ ను ఫోన్ టాపింగ్ కేసులో కేటీఆర్ ని, హరీష్ రావుని, సంతోష్ రావుని విచారించడంతోపాటు మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ సాధకుడు కేసీఆర్ పైనే సీట్ విచారణకు పూనుకోవడం దారుణమైన తప్పిదం అని అన్నారు. ప్రతి ఎలక్షన్ల ముందు ఏదో ఒక పేరుతో టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వేధించడం ద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూడడం అనాగరిక చర్య రేవంత్ రెడ్డి కచ్చా సాధింపు చర్యల్లో భాగంగా ఈ విచారణను చేస్తున్నాడని వెంటనే కేసీఆర్ పై విచారణను ఆపివేయాలని ఫోన్ టాపింగ్ ఏదైనా జరిగి ఉంటే అది ఇంటలిజెన్సీ లేదా ఇతర పోలీసు అధికారుల చర్యల్లో భాగంగా జరిగి ఉండవచ్చు.

ప్రతి ప్రభుత్వం రాష్ట్రములో శాంతి భద్రతలను కాపాడడానికి కొంత సమాచారాన్ని సేకరించడానికి ఏవైనా ఎవరైనా బాధ్యులు అయి ఉంటే ఇదివరకే అధికారులను విచారించారని నిజంగా అందులో నిజం ఉంటే ఇప్పటికే చర్యలు తీసుకునే వారిని అని అన్నారు.కేవలం రాజకీయ సాధింపులో భాగంగా ఇటువంటి దుర్మార్గమైన విధానాలని పాటిస్తే భవిష్యత్తులో ఏ ముఖ్యమంత్రి అధికారంలో ఉండలేడని ఇకనైనా ఇటువంటి చర్యలను మానుకొని ప్రభుత్వాల్లోకి వచ్చినప్పుడు ప్రజలకు ఇచ్చిన హామీలను గ్యారెంటీలను నెరవేర్చాలని ఆ దిశగా అభివృద్ధి దిశగా అడుగులు వేయకుండా నిత్యము ప్రతిపక్షంపై నోరు జారుతూ వేధింపులు చేస్తూ పోతుంటే తెలంగాణ ప్రజలు చూస్తూ ఊరుకోరని ఇకనైనా వెంటనే సీట్ విచారణను కేసీఆర్ గారి పై ఆపివేయాలని డిమాండ్ చేశారు. ఆరు గ్యారెంటీలు 420 హామీలను అమలు చేయడానికి చేతగాక విచారణ పేరుతో ప్రజల దృష్టిని  మళ్లించడానికి ఈటువంటి దుర్మార్గమైన చర్యలకు పాల్పడడం సిగ్గుచేటు అని అన్నారు. తక్షణమే కేసీఆర్ గారికి ఇచ్చిన నోటీసులను వెనుకకు తీసుకోవాలని లేని పక్షంలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.