30-01-2026 07:27:40 PM
మోతె,(విజయక్రాంతి): మెడికల్ క్యాంపుతో రోగులకు చికిత్స అందిస్తున్నట్లు మండల ప్రాధమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ భవాని, డాక్టర్ బిందు లు తెలిపారు. గడిసిన మూడు రోజులు మండల పరిధిలోని సిరికొండ గ్రామంలో డయేరియా కారణంతో సుమారు 82 మంది కలుషితం అయిన నీటిని త్రాగడం డయేరియా బారిన పడి చికిత్స పొందుతూన్నారు. గ్రామంలో త్రాగు నీటి పైపు లైన్ల లీకేజీ ల ద్వారా నీటి కాలుష్యం పెరిగే అవకాశం ఉందని సుమారు తొమ్మిది చోట్ల గుర్తించి వెంటనే మరమ్మత్తులు చేపట్టినట్లు చెప్పారు. మెడికల్ క్యాంపును జిల్లా అంటువ్యాధుల నిర్మూలన అధికారి డాక్టర్ సతీష్, సందర్శించి పరిస్థితులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ నెల 28వ తారీకు న 11 మంది అనారోగ్యానికి గురికాగా 29వ తారీకు న 7గురు 30తారీకు న 11 మంది అనారోగ్యానికి గురి కాగా మండల వైద్యా సిబ్బంది చికిత్స అందించడం జరుగుతుందని. త్రాగు నీటి నమూనాలు ల్యాబ్ కు పంపమని ఇంకా రిపోర్ట్ వివరాలు అందలేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బొర్ర వెంకటేష్, గ్రామ కార్యదర్శి భూలక్ష్మి ,హెల్త్ సూపర్ వైజర్ బి.పద్మ, హెల్త్ అసిస్టెంట్ రవి కుమార్, శ్రీనివాస్ రెడ్డి, ఏ యన్ యం విజయ లక్ష్మి, జయసుధ, ఆశ కార్యకర్తలు స్వాతి, గురులక్ష్మి, కమలమ్మ, తదితరులు పాల్గొన్నారు.