calender_icon.png 30 January, 2026 | 9:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్సిపల్ ఎన్నికల సాధారణ పరిశీలకులను కలిసిన ఎస్పీ

30-01-2026 07:31:18 PM

మెదక్,(విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల సాధారణ పరిశీలకులు  టి. రవి కిరణ్ ని జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు మర్యాదపూర్వకంగా కలుసుకొని మొక్కను అందించారు. ఈ సందర్భంగా జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఉన్న ప్రస్తుత శాంతి భద్రతా పరిస్థితులు, చేపట్టిన చర్యలు తదితర అంశాలను ఎన్నికల పరిశీలకులకు వివరించారు. జిల్లాలో శాంతియుత, స్వేచ్ఛాయుత ఎన్నికలు నిర్వహించేందుకు పోలీస్ శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసిందని జిల్లా ఎస్పీ తెలియజేశారు.