calender_icon.png 30 January, 2026 | 8:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆచారాల పేరుతో అంధకారంలో ఉండొద్దు

30-01-2026 06:59:24 PM

ఎంపీడీఓ ఆంజనేయులు

మోతె,(విజయక్రాంతి): ఆచారాల పేరుతో ఎవరు అందకారంతో జీవంచవద్దని యం పి డి ఓ ఆంజనేయులు అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని హుస్సేనాబాద్, కొత్తగూడెం, సిరికొండ, కస్తూర్భా గాంధీ పాఠశాలలో జిల్లా లీగల్ సర్వీస్ ఆధారిటి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ... రోజు రోజు సంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న చంద్ర గ్రహణంపైకి రాకేట్లతో ప్రయనిస్తున్న తరుణంలో ఊరు చివరలో పసుపు, కుంకుమ నిమ్మకాయలను చూసి భయబ్రాంతులకు గురైతున్న మని చెప్పారు. ఆస్థి కోసమో బంధుత్వం కోసమో పిల్లల జీవితాలను బలిచేయవద్దని, పిల్లల చదువు కోసం ప్రభత్వం లక్షల కోట్లు ఖర్చు చేసి విద్యా బోధన చేస్తున్నారు.

పిల్లలకు కావాల్సిన ప్రతి సౌకర్యం కల్పించడం జరుగుతుందని, అర్ధంతరంగా పెళ్లిళ్ల పేరుతో బాలల భవిష్యత్ ను పాడు చేయవద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా లీగల్ సర్వీస్ ఆధారిటి వాలెంటరీలు గుద్దేటి వెంకన్న, పల్లెల లక్ష్మణ్, ఎస్.కృష్ణ వేణి,  ఏపీఓ నాగేష్, ఈసి శ్రీహరి, ఐసీడీఎస్ మోతె సెక్టర్ విస్తరణ అధికారి బి.లక్ష్మి, హుస్సేనా బాద్ సర్పంచ్ శ్రీరాములు, కార్యదర్శి సౌమ్య, కొత్త గూడెం కార్యదర్శి కవిత,  కస్తూరి భా గాంధీ పాఠశాల ఇంచార్జి ప్రిన్సిపాల్ రజిని, ఫీల్డ్ అసిస్టెంట్ శ్యామ్, అంగన్వాడీ టీచర్ శ్రీలత, విద్యార్థిని లు తదితరులు పాల్గొన్నారు.