30-01-2026 06:54:37 PM
కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): జిల్లా దివ్యాంగుల శాఖ అధికారి ఆడేపు భాస్కర్, జిల్లా దివ్యాంగుల ఫీల్డ్ రెస్పాన్స్ అధికారి రవి, దివ్యాంగుల అభివృద్ధికి అందిస్తున్న విశిష్ట సేవలను గుర్తించి గణతంత్ర దినోత్సవ వేడుకల లో జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ అధికారులుగా అవార్డులు అందుకున్నారు.
ఈ సందర్భంగా వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో గురువారం వారికి పూల బొకేలు అందించి, శాలువలతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో విహెచ్ పి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇస్లాంబిన్ హసన్, శ్రీనివాస్, ఫణికుమార్, శంకర్, పెంటు, మనోహర్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.