18 April, 2026 | 6:25 PM

జూలైలో రాజకీయ శిక్షణా తరగతులు

16-06-2025 01:42 AM

 ‘తెలంగాణ జాగృతి’  అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్, జూన్ 15 (విజయక్రాంతి): ‘తెలంగాణ జాగృతి’ ఆధ్వర్యంలో యువతీ యువకులకు జూలై లో రాజకీయ శిక్షణా తరగతులు నిర్వహిస్తామని సంస్థ అధ్యక్షురాలు, కల్వకుంట్ల కవిత వెల్లడించారు. ఇప్పటినుంచి నెలలో మూడు రోజుల పాటు తరగతులు కొనసాగిస్తామని ఆమె స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆదివారం ఆమె రాజకీయ శిక్షణా తరగతులకు సంబంధించిన పో స్టర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు.

ఆగస్టు నుంచి జిల్లాల్లోనూ ప్రతి నెలా తరగతులు నిర్వహి స్తామన్నారు. తరగ తులకు వి ద్యార్థులు, మహిళలు.. ఎవరైనా హాజరు కావొచ్చని ఆహ్వానం పలి కారు. సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే, ఎంపీ స్థాయి వరకు ఉండే పరిమితులు, అధికారాలు, విధులు నేటి యువతకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు.