24-01-2026 12:17:01 AM
హైదరాబాద్, జనవరి 23 (విజయక్రాంతి) : బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు, ఉద్యమకారుడు, ములుగు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ కుసుమ జగదీశ్ కుటుంబానికి మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అండగా నిలిచారు. పార్టీలో మొదటి నుంచి క్రియాశీల కంగా వ్యవహరించిన కుసుమ జగదీశ్ రెండేళ్ల క్రితం అనారోగ్యంతో మరణించారు. జగదీశ్ కుమార్తె సుకీర్తి మెడిసిన్ చదవడానికి ప్రయత్నిస్తున్న విషయాన్ని కేసీఆర్ పార్టీ నా యకుల ద్వారా తెలుసుకున్నారు.
ఆమె మెడిసిన్ చదవడానికి అవసరమైన ఫీజు చెక్కును శుక్రవారం ఎర్రవల్లి నివాసంలో సుకీర్తికి అం దజేశారు. మంచిగా చదువుకోవాలని, వారి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని సుకీర్తిని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, మాజీ ఎమ్మె ల్యే రసమయి బాలకిషన్ పాల్గొన్నారు.