27-11-2025 12:00:00 AM
బీసీలకు రిజర్వేషన్లు తగ్గడంతో జనరల్ లో పోటీకి సన్నద్ధం
పల్లెల్లో మొదలైన ‘స్థానిక’ సందడి
ఏరులై పారున్న మద్యం
చేవెళ్ల, నవంబర్ 26, (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లాలో ఎన్ని రోజులు వేచి చూసిన సందర్భం రానే వచ్చింది. స్థానిక సంస్థల్లో యుద్ధానికి తెరలేచింది. గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలు రావడం తో పల్లెలు వేడెక్కాయి. పల్లెల్లో మద్యం ఏరులై పారనుoది. అభ్యర్థులను ఇప్పటికే ఓటర్లు మద్యం డబ్బుల విషయమై ఫోన్లు చేసి సఅభ్యర్థులను ఇప్పటికే ఓటర్లు మద్యం డబ్బుల విషయమై ఫోన్లు చేసి మా ఇంట్లో ఇన్ని ఓట్లు ఉన్నాయి అంటూ మచ్చిగా చేసుకుంటున్నారు. రంగారెడ్డి జిల్లాలో ఎన్ని రోజులు వేచి చూసిన సందర్భం రానే వచ్చింది.
స్థానిక సంస్థల్లో యుద్ధానికి తెరలేచింది. గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు. దీంతో రంగారెడ్డి జిల్లాలో ప్రతి గ్రామంలో ఎన్నికల జోష్ కనిపిస్తుంది. రంగారెడ్డి జిల్లాలో జిల్లా కలెక్టర్ ధపాల వారిగా పంచాయతీ, వార్టుల రిజర్వేషన్ విడుదల చేశారు.
ఆయా రిజర్వేషన్ ప్రకారంగా పోటీ చేసేందుకు వివిధ రాజకీయ పార్టీల నాయకులు సిద్ధమవుతు న్నారు. ఇప్పటికే అధికార పార్టీ నేతలు ఎన్నికల్లో గెలిచేందుకు వ్యూహాలను సిద్ధం చేసుకున్నారు. బీసీ, ఎస్టీ, ఎస్సీ, జనరల్ స్థానాలకు పోటీలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని రాజకీయ నాయకులు విశ్లేషణ చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో 526 పంచాయితీలు, 4668 వార్టులకు ఎన్నికలు మూడు విడతలో జరిగనున్నాయి.
తొలి విడుత నవంబర్ 27 నుంచి నామినేషన్లు, పోలింగ్, ఫలితాలు డిసెంబర్ 11, రెండో విడత నవంబర్ 30 నుంచి నామినేషన్లు, డిసెంబర్ 14 పోలింగ్, ఫలితాలు, మూడో విడత డిసెంబర్ 3 నుంచి నామినేషన్లు, డిసెంబర్ 17 పోలింగ్, ఫలితాలు ఉండవున్నాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయడంతో జిల్లాలో సోమవారం నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.
గ్రామాల్లో వేడెక్కిన రాజకీయాలు..
రంగారెడ్డి జిల్లాలో రాజకీయాలు వేడెక్కాయి. 42 శాతం బీసీ రిజర్వేషన్ ప్రకారంగా కేటాయించిన స్థానాల్లో పోటీ చేసేందుకు వివిధ రాజకీయ పార్టీల నేతలు ప్రయత్నాలు చేశారు. అయితే మారిన పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం 50 శాతం రిజర్వేషన్లు అమలు చేశారు. దీంతో రిజర్వేషన్ లు తరుమారు కావడంతో జనరల్ స్థానాల్లో కూడా బిసి వర్గాలు పోటీకి రంగం సిద్ధం చేసుకుంటున్నాయి.
అధికార కాంగ్రెస్ పార్టీ అయా నియోజకవర్గం ఉన్న ఎమ్మెల్యేలు ఎవరెవరిని పోటీలో నిలపలని ఆలోచన చేస్తున్నారు. జిల్లా లోని చేవెళ్ల, షాద్‌నగర్, ఆమనగల్లు ( కల్వకుర్తి), మహేశ్వరం, రాజేంద్రనగర్, ఇబ్రహీంపట్నం తదితర నియోజకవర్గంలో 526 పంచాయతీలు, 4668 వార్డు లను కైవసం చేసుకోవడానికి పార్టీ లు సిద్ధం అవుతున్నాయి.వీటి పరిధిలో 4682 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు.
ఆయా నియోజకవర్గంలో అధికార పార్టీనేతలు గెలుపు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. దానికి తోడు ప్రతిపక్ష పార్టీ బీఆర్‌ఎస్ కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో బీజేపీ, ఇతర పార్టీలు కలిసి పోటీ చేస్తున్నారో.. లేదో ఇంకా స్పష్టత రాలేదు. ఇప్పటికే ఆయా నియోజకవర్గంలో సర్పంచ్ అభ్యర్థులను ఎంపిక చేశారు. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో పైచేయి వివిధ పార్టీలు సాధించేందుకు సిద్ధమయ్యారు.
స్థానిక సంస్థల సమరానికి‘సై’
ప్రజలు ఎప్పడు ఎప్పుడా అని ఎదురు చూస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలు సమయం దగ్గరపడుతున్న తరుణంలో గ్రామాల్లో ఎక్కడ చూసినా ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. గెలుపు గుర్రాలను బరిలో దింపేందుకు ప్రధాన పార్టీలు పావులు కదుపుతున్నాయి.
రిజర్వేషన్ మాట పక్కన పెడితే ఈ సారి ఏది ఏమైనా మనం అనుకున్న అభ్యర్థి గెలుపు కోసమే పని చేయాలని రహస్య ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈసారి ప్రధాన పార్టీలకు ఎవరికి మద్దతు ఇస్తే వారిదే విజయం పొందే అవకాశాలను పార్టీలు, కొంతమంది అభ్యర్థులు చక్రం తిప్పనున్నారు.