27-11-2025 12:00:00 AM
-రాష్ట్ర ప్రభుత్వం విప్ ఆది శ్రీనివాస్.
-రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్.
రాజన్న సిరిసిల్ల, నవంబర్ 26 (విజయక్రాంతి): వేములవాడ పట్టణంలోని ఎస్ ఆర్ ఆర్ గార్డెన్స్ లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో భాగంగా వేములవాడ నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశం. రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్.రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయమే లక్ష్యంగా అందరూ కలసి కట్టుగా పని చేయాలి.అభ్యర్థి ఎంపిక సెలెక్ట్ అండ్ ఎలెక్ట్ పద్ధతిలో ఉంటుంది.రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లలి.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి మంచి వాతావరణం ఉంది.ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు అండగా నిలుస్తున్నారు.దానికి నిదర్శనం మొన్నటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.దేశంలో బడుగు బలహీనవర్గాలకుకాంగ్రెస్ పార్టీ ఎల్లపుడు అండగా ఉంటుంది.ఎంపిక కాబడిన ఏకఅభిప్రాయం వచ్చిన చోట నామినేషన్ వేయాలి.అందరికీ గౌరవం దక్కుతుంది.రాష్ట్రంలో 200 యూనిట్లు ఉచిత విద్యుత్,నూతన రేషన్ కార్డులు,రుణ మాఫీ వంటి పథకాలు ప్రతి గడపకూ చేరవేయాలి.ప్రజల మద్దతు పొంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయం కోసం కృషి చేయాలి.
మీకు అండగా నేను ఉంటా.
గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిస్తే మరింత అభివృద్ధి సాధ్యం.గత ఎన్నికల్లో ఇతర ప్రాంతాల్లో నుండి వచ్చి పోటీ చేసిన వారికి ప్రజలు బుద్ధి చెప్పారు.మనం ఎల్లపుడు ప్రజల మధ్య ఉంటున్నాం. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ వేములవాడ మార్కెట్ కమిటీ చైర్మన్ రోండి రాజు వైస్ చైర్మన్ రాకేష్. నియోజకవర్గ స్థాయికాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.