calender_icon.png 28 December, 2025 | 2:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హుజురాబాద్ ఆస్పత్రికి అంబులెన్స్

28-12-2025 12:45:57 AM

డాక్యుమెంట్లు అందించిన కేంద్రమంత్రి బండి సంజయ్ 

కరీంనగర్, డిసెంబరు 27 (విజయక్రాంతి): కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి  బండి సంజయ్ తన సొంత నిధులతో హు జురాబాద్ జనరల్ హాస్పిటల్‌కి  అందజేసిన అంబులెన్స్‌కు సంబంధించిన పత్రాలను శనివారం అందజేశారు.

కరీంనగర్ పార్లమెంటు బీజేపీ వెహికల్ ఇన్‌చార్జి సాంబ యిపల్లి శ్రీనివాస్‌రెడ్డి ద్వారా ఆస్పత్రి వైద్య అధికారి నల్ల నారాయణరెడ్డికి అందజేశారు. ఈ అంబులెన్స్ ద్వారా హుజురాబాద్ నియోజకవర్గంలోని రోగులకు అత్యవసర వైద్య సేవలు అందించడం సులభమవుతుందని ఆస్పత్రి అధికారులు తెలిపారు.