12-01-2026 12:12:45 AM
గుండాల, జనవరి 11 (విజయక్రాంతి): ఉమ్మడి మండలాలైన గుండాల, ఆళ్లపల్లిలలో నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగనుందని విద్యుత్ శాఖ అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 33/11 కేవీ మామకన్ను ఉపకేంద్రంలో నూతన ట్రాన్స్ఫార్మర్(బూస్టర్) ఏర్పాటు చేసే పనిలో భాగంగా ఉమ్మడి మండలంలో నేటి ఉదయం పదకొండు గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగనుందని, విద్యుత్ వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించగలరని వారు ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.