calender_icon.png 12 January, 2026 | 3:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేయాలి

12-01-2026 12:07:51 AM

ఉమ్మడి జిల్లా నేతలకు కేటీఆర్ దిశానిర్దేశం

ఆదిలాబాద్, జనవరి 11 (విజయక్రాంతి): రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ప్రతి మున్సిపాల్టీల్లో బీఆర్‌ఎస్ జెండా ఎగురవేయాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ నాయకులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నాయకులకు మాజీ మంత్రులు కేటీఆర్, హరీ ష్ రావులు దిశా నిర్దేశం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.

బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో మున్సిపాలిటీల అభివృద్ధి కోసం చేపట్టిన కార్యక్రమాలను ప్రజలకు వివరించాలన్నారు. ఈ సమావేశాని కి మాజీ మంత్రి, జిల్లా అధ్యక్షుడు జోగు రామ న్న, ఎమ్మెల్యే అనిల్ జాదవ్, కోవ లక్ష్మీ, మాజీ ఎమ్మెల్యే  బాల్క సుమన్, కోనేరు కోనప్ప, దుర్గం చిన్నయ్య, మాజీ జడ్పీ చైర్మన్ శ్యామ్ సుందర్, ఇతర నాయకులు హాజరయ్యారు.