calender_icon.png 29 August, 2025 | 8:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూరియా సరఫరాలో కేంద్రం విఫలం

29-08-2025 03:00:20 AM

డిమాండుకు అనుగుణంగా యూరియా అందించాలి

రైతులకు నష్టంభారినపడితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదే బాధ్యత

తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు 

జిల్లా నెట్వర్క్, ఆగస్టు 28: (విజయ క్రాంతి) డిమాండుకు అనుగుణంగా రైతులకు యూరియా సరఫరా చేయడంలో కేంద్రంలోని మోడీ సర్కార్ పూర్తిగా విఫలమైందని సిపిఐ, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘాల నాయకులు ఆరోపించారు. యూరియా కొరతను నివారించాలని డిమాండ్ చే స్తూ ఏఐకేఎస్ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా గురువారం జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో తహసీల్దార్ కార్యాలయాల ఎదుట ధర్నా నిర్వహించి వినతిపత్రాలు సమర్పించారు.

ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ అప్పులు చేసి సాగు ప్రారంభించిన రైతులకు సకాలంలో యూరియా అందకపోవడం రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఏర్పడిందని ఆ వేదన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి 9.80 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేస్తామని చె ప్పిన కేంద్రం ఇప్పటివరకు 5.62 లక్షల మెట్రిక్ టన్నుల యురియానే అందించి చేతులు దులుపుకుందని, దీంతో యూరియా కొరత ఏర్పడి రైతులు దిక్కుతోచని స్థితిలోకి చేరారని, ఇప్పటికే అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతులు యూరియా కొరతతో మరింత నష్టాలబారినపడి ఆ త్మహత్యలకు ప్రేరేపించబడే ప్రమాదం పరిస్థులు ఏర్పడ్డాయన్నారు.

తక్షణమే డిమాండుకు అనుగుణంగా యూరియా సరఫరా చేయాలనీ డిమాండ్ చేశారు. కార్యక్రమాల్లో నాయకులు సలిగంటి శ్రీనివాస్, కంచర్ల జమలయ్య, వాసిరెడ్డి మురళి, భూక్యా దస్రు, కొమారి హన్మంతరావు, దీటి లక్ష్మీపతి, జక్కుల రాములు తదితరులు పాల్గొన్నారు.