calender_icon.png 29 August, 2025 | 5:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తప్పుడు కుల ధృవీకరణపత్రంతో ఉద్యోగం?

29-08-2025 02:57:10 AM

  1. ఆఖరి నిమిషములో వెలుగు చూసిన వైనం.
  2. ఇప్పటికీ తప్పించే వైనం?
  3. ఈనెల 30 కి ఉద్యోగ విరమణ

భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 28, (విజయక్రాంతి): ప్రభుత్వ నిబంధనలను తుంగ లో తొక్కి తప్పుడు కుల ధ్రువీకరణ పత్రంతో ప్రభుత్వ ఉద్యోగంలో చేరి, 40 సంవత్సరాల పాటు బేషరతు గా విధులు నిర్వహించి నా ఓ ఉద్యోగి నిర్వాకం ఒకరి నిమిషంలో వెలు గు చూసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు గిరిజన సహకార సంస్థ మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్న ఓ ప్రభుత్వ ఉద్యో గి ఏకంగా తన కులాన్ని మార్చి గిరిజన కుల సర్టిఫికెట్ పొంది ఉద్యోగంలో చేరారు.

ఈ అంశం ఎంత కాలం గోప్యంగా ఉండి, ఈ నెల 30న ఆయన ఉద్యోగ విరమణ సమయంలో జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ఫిర్యాదులు అందాయి. గ త సోమవారం ప్రజావాణి లో ఇల్లందు మేనేజర్ తప్పు డు కుల దృవీకరణ పై సాక్షా ఆధారాలతో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుల స్వీకరించిన జిల్లా అధికారి విచారణ పేరుతో జాప్యం చేస్తున్నారని ఆరోపణలు వెలబడుతున్నాయి.

ఆ ఉద్యోగి అగ్రవర్ణనీ కి చెందిన వ్యక్తి కావడం, ఉద్యోగం కోసం గిరిజన సర్టిఫికెట్ సమర్పించినట్లు తెలుస్తోంది. ఏ విష యమై అడిషనల్ కలెక్టర్ డి వేణుగోపాల్ ను వివరణ కోరగా తప్పుడు కుల దృవీకర ణ పత్రంతో ఇల్లందు మేనేజర్ పై ఫిర్యా దు వచ్చిన మాట వాస్తవమేనని క మిటీ సమక్షంలో విచారణ చేసి చ ర్యలు తీసుకుంటాం అనడం గ మనర్హం. అల్లుడు వచ్చే దాకా అ మావాస్య ఆగుతుందా అన్నట్లు ఉంది. ఈ లోగా సదరు ఆ ఉద్యోగి ఉద్యోగ విరమణ పూర్తవుతుంది.