12-01-2026 01:16:11 AM
కొట్టపల్లి, జనవరి11 (విజయక్రాంతి): కరీంనగర్ నగరంలోని రేకుర్తిలో గల కోటా పబ్లిక్ స్కూల్ ప్రాంగణంలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సంప్రదాయ వాతావరణాన్ని ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన ఈ వేడుకలు విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సమక్షంలో ఉత్సాహంగా సాగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కోట విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ డి. అంజిరెడ్డి మాట్లాడుతూ, సంక్రాంతి పండుగ మన సంస్కృ తి, సంప్రదాయాల గొప్పతనాన్ని భావితరాలకు పరిచయం చేసే మహత్తర పండుగ అని పేర్కొన్నారు. ఆధునిక విద్యతో పాటు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రాధాన్యత ఇవ్వడం ఎంతో అవసరమని అన్నారు. విద్యార్థుల్లో సాంస్కృతిక విలువలు, కుటుంబ బంధాలు, పండుగల ప్రాముఖ్యతను పెంపొందించడంలో ఇలాంటి కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు.