12-01-2026 01:18:04 AM
ముకరంపుర, జనవరి 11 (విజయక్రాంతి) : ధనుర్మాసోత్సవాల్లో భాగంగా ఆదివారం ఆలయాల్లో, శ్రీవైష్ణవ సాంప్రదాయపరుల గృహాల్లో భక్తులు కూడారై వేడుక ఘనంగా నిర్వహించారు. పాయసాన్ని నివేదన చేసి పాశురాన్ని అనుసంధానం చేశారు. పాయన పాత్రలను వితరణ చేశారు. మార్కెట్రోడ్ వేంకటేశ్వరాలయంలో ఆలయ వ్యవస్థాపక ధర్మకర్తలు చకిలం శ్రీనివాస్, చకిలం గంగాధర్, ఇఓ కందుల సుధాకర్ పాల్గొన్నారు. వావిలాలపల్లి రామాలయంలో మాజీ కార్పోరేటర్ మేచినేని వనజ, ఆలయ కమిటీ అధ్యక్షుడు మేచినేని అశోర్రావు, సభ్యులు పాల్గొన్నారు. సప్తగిరికాలని కోదండ రామాలయంలో చైర్మన్ కె. గౌతమరావు వమ్యులు పాల్గొన్నారు.
మంకమ్మ తోట వేంకటేశ్వరస్వామి ఆలయంలో వ్యవస్థాపక వంశ పారంపర్య ధర పాల్గొన్నారు. యజ్ఞవరాహక్షేత్రంలో సర్వవైదికసంస్థానంట్రస్టు మే పలు, నరసింహాచార్యులు క్వార్టర్స్. వెంకటేశ్వరస్వామి గుడిపాటి శంకరెడ్డి, మడతల ల శ్రీనివాస్, ఈఓ నాగారపు శ్రీనివాస్, అర్చకులు పీచ శ్రీభాష్యం వరప్రసాద్, సభ్యులు పాల్గొన్నారు. విద్యానగర్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అధ్యక్ష కార్యదర్శులు కామ అంటు మీరయ్య, రాంరెడ్డి, డి సత్యనారాయణ, జి సత్యనారాయణ, పాపిరెడ్డి, శ్రీనివాస్, ఉత్తమాచారి లతో పాటు కార్యవర్గం పాల్గొన్నారు.
వేదభవనం, ఆం డాళ్గోష్ఠిలో జరిగిన వేడుకల్లో వికాసతరంగిణి బాధ్యులు, భక్తులు పాల్గొన్నారు. కట్టరాంపూర్ గోదా లక్ష్మీ సమేత వేంకటేశ్వరాలయంలో, జ్యోతీనగర్ వేంకటేశ్వరాలయంలో, చైతన్యపురి మహాశక్తి ఆలయంలో కూడారై వేడుకలు జరిగాయి. శ్రీపురంలో కూడారై వేడుకతో పాటు కల్యాణం నిర్వహించారు. శ్రీరాంనగర్ కాలనీ యూనివర్సిటీ రోడ్లోని శ్రీరావ మందిరంలో జరిగిన కూడారై వేడుక, గోదా రంగనాథుల కల్యాణంలో చైర్మన్ దన్నపునేని మాదవరావు, కార్యదర్శి గజవాడ ఆంజనేయులు, సభ్యులు పాల్గొన్నారు.