29-01-2026 01:20:54 AM
ఇక ఈ ఏడాది నుంచి రెండో దశ అభివృద్ధి
2047 నాటికి ‘వికసిత భారత్’ సాధనే ధ్యేయం
ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ముర్ము ప్రసంగం
న్యూఢిల్లీ, జనవరి 28: ‘దశాబ్దం నుంచి భారత్ గణనీయమైన అభివృద్ధి సాధిస్తున్నదని, 2026 నుంచి రెండోదశ అభివృద్ధి ప థంలోకి అడుగుపెడుతున్నది. 2047 నాటికి ’వికసిత భారత్’ లక్ష్యాన్ని చేరుకోవడమే ధ్యే యంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోంది’ అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉద్ఘాటించారు. బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా బుధవారం ఆమె పార్లమెంట్‌లో ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ‘గడిచిన పదేళ్లలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు. 4 కోట్ల కుటుంబాలకు శాశ్వ త గృహాలు అందాయి. ‘జల్ జీవన్ మిషన్’ ద్వారా 12.5 కోట్ల ఇళ్లకు నల్లా నీరు అందుతోంది.
‘ఉజ్వల యోజన’ ద్వారా 10 కోట్ల కుటుంబాలకు గ్యాస్ కనెక్షన్లు అందాయి. ‘ఆయుష్మాన్ భారత్’ కింద ఇప్పటివరకు 11 కోట్ల మంది ఉచిత వైద్యం, శస్త్రచికిత్సలు అం దాయి. దేశం ఇప్పుడు అత్యంత వేగంగా బలమైన ఆర్థికవ్యవస్థగా ఎదుగుతున్నది. ఆహార ధాన్యాల ఉత్పత్తిలో 350 మిలియన్ టన్నులు సాధించి రికార్డు సృష్టించింది. మొబైల్ ఫోన్ల తయారీలో ప్రపంచంలోనే రెండో స్థానంలో నిలిచింది. ఈ దశాబ్దంలో దేశంలోకి 750 బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయి. జీ20, బ్రిక్స్, ఎస్‌సీవో వంటి వేదికలపై భారత్ తన ప్రభావాన్ని చాటుకుంది’ అని కొనియాడారు.
నేడు ఆర్థిక సర్వే విడుదల
బడ్జెట్ సమావేశాల్లో భాగంగా పార్లమెంట్‌లో గురువారం ఉదయం ౧౧ గంట లకు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ దేశ ఆర్థిక ముఖచిత్రాన్ని ఆవిష్కరించే ‘ఆర్థిక సర్వే 2025 విడు దల చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు వీ అనంత నాగేశ్వరన్ బృందం ఈ సర్వే నివేదిక సిద్ధం చేసింది. సర్వేను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన అనంతరం మధ్యాహ్నం అనంత నాగేశ్వరన్ మీడియా సమావేశం నిర్వహించి కీలక అంశాలను వివరిస్తారు.