calender_icon.png 25 December, 2025 | 3:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మూడు దేశాల పర్యటనకు రాష్ట్రపతి

03-08-2024 05:05:14 AM

న్యూఢిల్లీ, ఆగస్టు 2: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 5వ తేదీ నుంచి 10 వరకు న్యూజీలాండ్, ఫిజీ, తిమోర్ లెట్సే దేశాల్లో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఆ మూడు దేశాల అధినేతలతో ముర్ము సమావేశమై రక్షణ, విద్య, వైద్యం, ప్రజా సంబంధాలు తదితర అంశాలపై చర్చలు జరుపుతారని విదేశాంగ శాఖ కార్యదర్శి (తూర్పు) జైదీప్ మజుందార్ శుక్రవారం వెల్లడించారు.  ఫిజీ, తిమోర్ లెట్సేలో పర్యటించనున్న తొలి భారత రాష్ట్రపతి ముర్ము కావటం గమనార్హం.